Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Runamafi : రుణమాఫీకి డెడ్ లైన్.. డేట్ ఫిక్స్ చేసిన మంత్రి తుమ్మల..!

Runamafi : రుణమాఫీకి డెడ్ లైన్.. డేట్ ఫిక్స్ చేసిన మంత్రి తుమ్మల..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా మూడు విడుదలగా రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేశారు. 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయల మాఫిని చేశారు. కాగా మరో 13 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది.

అందుకు రైతుల పూర్తి డాటా తప్పులుగా పడటం వల్ల ప్రభుత్వం వారికి రుణమాఫీ చేయలేదు. ఆధార్ కార్డులో పొరపాట్లు, బ్యాంకు ఖాతాలలో కేవైసీ లేకపోవడం, రేషన్ కార్డుల్లో తప్పులు ఉండటం వల్ల.. సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కాలేదు.

అలాంటి రైతుల నుంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ సర్వే చేపట్టారు. కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తయ్యాక కుటుంబ సభ్యుల ఫోటో కూడా రైతు భరోసా యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది.

రెండు లక్షల రూపాయల రుణాలు పైగా ఉన్న వారికి కూడా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో వారు రెండు లక్షలకు పైగా ఉన్న రుణం బ్యాంకులలో ఎప్పుడు చెల్లించాలనే విషయం స్పష్టంగా తెలియజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వెల్లడించారు.

రుణమాఫీ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని అందుకు 2024 డిసెంబర్ 9వ తేదీలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం 50 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. మరో 13 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ 9వ తేదీ లోగా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ప్రతిపక్షాలు కావాలని రుణమాఫీపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ తో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు