Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ పురుగుమందుల విక్రయం..!

Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ పురుగుమందుల విక్రయం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్నారనే విషయం తేటతెల్లమైంది. పేరుగాంచిన కంపెనీల పేరుతోనే నకిలీ మందులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారుల తనిఖీలలో గురువారం బట్టబయలైంది. దుకాణాలలో లభించే పురుగుమందులు కొనుగోలు చేస్తున్న రైతులు నిండా మనుగుతున్నారు.

వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఏచూరి శ్రీనివాస్ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ దుకాణంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, సిజెంటా కంపెనీ ప్రతినిధులు తనిఖీలు నిర్వహించారు. కాగా సిజెంట కంపెనీకి చెందిన క్రిమిసంహారక మందులు నకిలీవి ఉన్నట్లుగా వ్యవసాయ అధికారుల ముందు కంపెనీ ప్రతినిధులు తేల్చారు.

సుమారుగా 52,900 విలువైన సిజెంట కంపెనీ నకిలీ పురుగు మందులను సీజ్ చేశారు. ఈ విషయంపై ఫర్టిలైజర్ డీలర్ ను అధికారులు ప్రశ్నించగా తాను రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రమేష్ బాబు అనే డీలర్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు.

మధ్యవర్తిని పిలిపించి ప్రశ్నించగా అతను దామరచర్ల మండలం వీర్లపాలెం కు చెందిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నిర్వాహకుడు రాజిరెడ్డి ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అధికారులు కంపెనీ ప్రతినిధులు రాజిరెడ్డిని ప్రశ్నించగా తాము గుంటూరుకు చెందిన రమేష్ నాయక్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా నకిలీ పురుగుమందుల విషయంపై వాడపల్లి పోలీసులకు మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాప్ ను సీజ్ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వారి వెంట మిర్యాలగూడ ఏ డి ఏ దేవ్ సింగ్ ఉన్నారు. రైతులు నకిలీ పురుగుమందులు కొనుగోలు చేసి మోసపోవద్దని పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు