Hyderabad : కూకట్ పల్లి లో రోడ్లపై వ్యభిచారుల గుర్తింపు.. తహసిల్దార్ వద్ద బైండోవర్..!
Hyderabad : కూకట్ పల్లి లో రోడ్లపై వ్యభిచారుల గుర్తింపు.. తహసిల్దార్ వద్ద బైండోవర్..!
కూకట్ పల్లి, మన సాక్షి
హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం వివిధ ప్రాంతాలలో రోడ్లపై వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురి పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఆయా పరిధిలోని కొందరు బస్టాప్ ల వద్ద విటులను ఆకర్షించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మహిళలను గుర్తించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ సూచన మేరకు ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో లా అండ్ ఆర్డర్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డుపై వ్యభిచారం నిర్వహించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో భాగ్యనగర్ కాలనీ బస్టాప్ వద్ద 31 మంది మహిళలను, నలుగురు ట్రాన్స్ జెండర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూకట్ పల్లి ఎమ్మార్వో సమక్షంలో వీరిని బైండోవర్ చేసినట్లు ఏసుపీ తెలిపారు.
LATEST UPDATE :









