Breaking Newsఉద్యోగంతెలంగాణ

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి శుభవార్త..!

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ (డియర్ నెస్ అలవెన్స్) ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. DA 3.64% ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన డిఎ 2022 జూలై 1వ తేదీ నుంచి వర్తించనున్నట్లు వెల్లడించింది.

నవంబర్ లో చెల్లించే వేతనంతో పాటు పెరిగిన డిఏ కూడా చెల్లించనున్నారు. 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు డిఏ బకాయిలను జిపిఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. అదే విధంగా 2025 మార్చి 31వ తేదీ లోపు పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకు డిఏ బకాయిలను 17 సమాన వాయిదాలలో ప్రభుత్వం చెల్లించనున్నది.

MOST READ : 

మరిన్ని వార్తలు