Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Free Gas Cylinder : ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Free Gas Cylinder : ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

మన సాక్షి అమరావతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ఆసరా పింఛన్లు పత్తి నెల ఒకటవ తేదీ ఇస్తుండగా మహిళలకు దీపావళి కానుకగా మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ రోజు ప్రారంభించారు. . ఈ పథకంలో భాగంగా తొలి విడత గ్యాస్ సిలిండర్ ఎప్పటిలోగా బుక్ చేసుకోవచ్చు అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన మూడు రోజుల్లోనే 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.

అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నారాయణల మనోహర్కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించి తీరుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం భారీగా అప్పులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నింటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో మార్పులు చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీ అయిన వెంటనే లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులు మార్చి నెల చివరి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు  ఆయన తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు