District collector : మాతృ మరణాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
District collector : మాతృ మరణాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య పరంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మాతృ మరణాల సమీక్ష సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు.
జిల్లా వైద్యశాఖ అధికారిని, ప్రోగ్రాం అధికారి, సూపరింటిoడెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయ సమావేశం నిర్వహించుకుని జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎంసి చెకప్ సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు గమనిస్తారా ?లేదా? అని ఏఎన్ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రతి గర్భిణీకి వైద్య సలహాలలో ఏ ఏ విషయాలు చెబుతారని ఆశా కార్యకర్తలను ప్రశ్నించారు. గర్భిణీ సమయంలో వచ్చే ప్రమాద సంకేతాల గురించి వైద్యాధికారులు ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు వివరంగా తెలియజేసి వారి ద్వారా గర్భిణీలకు సలహాలు సూచనలు ఇప్పించాలని ఆమె తెలిపారు.
జిల్లా ఆసుపత్రిలో ఉండే గైనకాలజిస్టులు ఎన్సీపీ కార్డులో గర్భిణీ లను పరీక్షించేటప్పుడు పూర్తి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లాలో మాతృ మరణాలు చోటుచేసుకున్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో పాటు బాధిత కుటుంబ సభ్యులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.
సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శైలజ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వై. మల్లికార్జున్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు డాక్టర్ నరసింహారావు సగరి, డాక్టర్ క్యాతన్ తిరుపతి, భవానీ, శ్రీలత, ఏం. పీహెచ్ఈఓ గోవిందరాజు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ :
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!









