Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
మెదక్Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణ

District collector : రైతులను ఇబ్బందులు పెట్టొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : రైతులను ఇబ్బందులు పెట్టొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

టేక్మాల్, మన సాక్షి ప్రతినిధి:

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట గ్రామంలో ఐకెపి సెంటర్ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు.

అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. సంబంధిత ఏఈఓ ను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది. అని తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కోరంపల్లి గ్రామంలో బుధవారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ మొదలగు సమగ్ర ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే తీరును ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించిన వివరాలను గొప్పగా ఉంచడం జరుగుతుందని అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమారెటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు. ఈనెల 6 నుండి 8 వరకు ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని సర్వే ఫారంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పులు నింపవద్దని ఏవైనా సందేహాలు ఉంటే సుప్రవైజర్ లను అడిగి తెలుసుకోవాలన్నారు.

ఇండ్ల జాబితాను తయారీ సందర్భంగా ఇంటిని సందర్శించినట్టుగా స్టిక్కర్ ను అతికించాలని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు డేటాను ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టేక్మాల్ మండల కేంద్రంలోని పశువైద్యశాలను ఆకస్మితంగా తనిఖీ చేశారు ముందుగా హాజరు పట్టికను, పలు రికార్డులను పరిశీలించరు.

అనంతరం పశువులకు కాలానుగుణంగా వేయవలసిన వ్యాక్సినేషన్ వివరాలు సిబ్బందిని అడిగారు. పశువులకు వచ్చే వ్యాధులను అరికట్టడంలో పశుసంవర్ధక శాఖ అధికారులు విశేష కృషి చేయాలని కోరారు. పాల ఉత్పత్తులు పశుగ్రాసం పార్టీ పెంపకం మేకల పెంపకం ఉత్పత్తుల శిక్షణ మరియు ఆరోగ్య సేవల అభివృద్ధి ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు, టేక్మాల్ తాసిల్దార్ తులసీరామ్, మండల అభివృద్ధి అధికారి విటల్,ఆర్ఐ సంతోష్, ఏపీఎం రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ఐకెపి సెక్టార్ ఇన్చార్జి సంజీవరెడ్డి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ హనుమంతు పశు వైద్య సిబ్బంది కృష్ణ, ఆనంద్, శ్యామల. అధికారులు రైతులు పలువురు ఉన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు