TOP STORIESBreaking Newsవ్యవసాయంసంక్షేమం

Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!

Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా అందజేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. మొదటి విడత పంట సహాయం రైతుల ఖాతాలలో నేరుగా పడనున్నది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నారనే అపవాదు నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేసిన రైతుబంధు పథకాన్ని కొనసాగించడం లేదని వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు తరహాలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం విధితమే.

రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రైతులకు 7500 సహాయం 2 విడతలుగా రూ.15000 అందజేస్తామని తెలియజేసిన విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ పూర్తయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక విడత కూడా రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందజేయలేదు.

దాంతో రైతుల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రైతు బంధు పథకంలో లోపాలను సరిదిద్దేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వానకాలం పంటల సీజన్ పూర్తయినప్పటికీ కూడా సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో రైతు భరోసా ద్వారా పంటల సహాయం అందజేయలేకపోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా విజయోత్సవాల్లో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా విజయోత్సవాలు జరుపుకుంటే మరింత తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించారు.

కాగా విజయోత్సవాల్లో భాగంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. విజయోత్సవాలు ప్రారంభమయ్యాక డిసెంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ నెల వరకు రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఎకరానికి 7500 బ్యాంకు ఖాతాలలో వేయనున్నారు.

కఠినమైన నిబంధనలు:

రైతు భరోసా పథకానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం. రైతుబంధు పథకంలోని లోపాలను సరిదిద్దుద్దేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా రైతు వేదికల వద్ద రైతులతో అధికారులు చర్చించారు. రైతుల సూచనలు, సలహాలు ప్రభుత్వం స్వీకరించింది. రైతుల సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.

రైతు భరోసా పథకంలో కేవలం సాగులో ఉన్న భూములకే పంట సహాయం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఏడు ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసాను అందజేసే అవకాశం ఉంది. ఈ లెక్కన తెలంగాణలో సాగుభూమి 1.39 కోట్ల ఎకరాలు ఉండగా భరోసా కు సుమారుగా రూ.7000 కోట్ల నిధులు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్కమ్ టాక్స్ హోల్డర్లకు రైతు భరోసా పథకం అందజేయరు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా నిర్వహించే ప్రజా ఉత్సవాలలో రైతు భరోసాను రైతులందరికీ అందజేసి రైతుల్లో ఆనందం నింపాలని ప్రభుత్వం భావిస్తుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు