Narayanpet : కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రారంభించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Narayanpet : కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రారంభించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాలో కొనసాగుతున్న కుటుంబ సమగ్ర సర్వే వేగం పెంచాలని, సోమవారం నుంచి డాటా ఎంట్రీ ప్రారంభించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సితాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గ్రూప్ – 3 పరీక్షల నిర్వహణ, వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఆది సోమవారాల్లో జరిగే గ్రూప్ -3 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అలాగే జిల్లాలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సివిల్ సప్లై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో అవసరమైనన్ని టార్ఫా లిన్లు, డిజిటల్ మైక్రో మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
.పత్తి కొనుగోళ్ల విషయంలో చర్చించారు. సామాజిక సర్వే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలలో సర్వే మందకొడిగా సాగుతోందని, స్పీడ్ అప్ చేయాలని మున్సిపల్ కమిషనర్ సునీత ను ఆదేశించారు.
సర్వే సమగ్ర వివరాల డాటా ఎంట్రీ కి ఎంతమంది ఆపరేటర్లు అవసరమో గుర్తించి సోమవారం నుంచి డాటా ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. డాటా ఎంట్రీ కోసం మీసేవ ఆపరేటర్లను కూడా వినియోగించుకోవాలన్నారు. అవసరమైనన్ని కంప్యూటర్లు ఉన్నాయా ? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
సర్వే పూర్తి వివరాలపై డిపిఓ నివేదికను తెలుసుకున్నారు. సర్వే పూర్తిచేసిన ఫారాల భద్రత స్టోరేజ్ ఎంపీడీవో, కమిషనర్ల దే బాధ్యత అని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం, ఆర్డీవో రామచందర్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు..!
-
Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!
-
Talent : గ్రూప్ – 4 లో ప్రతిభ.. మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన యువకుడు..!
-
Ration Card : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్..!
ManaSakshi YouTube
👇









