Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఖమ్మం జిల్లాతెలంగాణవ్యవసాయం

Khammam : పంట నష్టపరిహారం ఇవ్వలేదని సీపీకి ఫిర్యాదు చేసిన రైతు..!

Khammam : పంట నష్టపరిహారం ఇవ్వలేదని సీపీకి ఫిర్యాదు చేసిన రైతు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంను సోమవారం సందర్శించారు.

కేంద్రం వద్ద రైతులతో మాట్లాడారు…పత్తి దిగుబడులు ఎంత వస్తుంది. ఖర్చులు ఇతరత్రా విషయాలను అడిగి తెలుసుకున్నారు. పత్తిని స్వయంగా తేమ శాతం ను పరిశీలించారు. ధాన్యం, పత్తి రవాణా లో ఇబ్బందులు లేకుండా చూడాలని అదేశించారు.

మార్కెట్ అధికారులకు పలు సూచనలు చేశారు. చైర్మన్ వెన్నపూసల సీతారాములు ను మార్కెట్ ద్వారా క్రయ, విక్రయాలు, మార్కెట్ ద్వారా అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు’ రాకుండా అప్రమతం కావాలని సూచించారు.

మండలంలోని రాజేశ్వరపురంలోని అరుణాచలం రైస్ మిల్లు వద్ద ఆదివారం రైతులు చేసిన ఆందోళన గురించి అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మిల్లు పై సమగ్ర విషయాల గురించి ఆరా తీశారు. మంగాపురంతండా కు చెందిన రైతు పంట నష్ట పరిహారం తమకు ఇవ్వలేదని సీపీ కి ఫిర్యాదు చేశారు.

స్పందించిన సీపీ ఏవో రాధను పిలిచిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయం ను పరిశీలించి రైతు కు న్యాయం చేయాలని సూచించారు. అనంతరం సింగారెడ్డిపాలెం లోని సాంఘిక సంక్షేమఖ గురుకుల బాలికల పాఠశాల ను సందర్శించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించారు.

పిచ్చి గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో ఎక్కడా కూడ మురుగు నీరు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్ధినులను కంటికి రెప్పలా చూసుకోవాలని అన్నారు.

అదే విధంగా విద్యార్దినులు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా వాతావరణం కలిగించాలని ఉపాద్యాయులను ఆదేశించారు. వారికి ఏదైనా సమస్యల వస్తే తమ దృష్టికి తీసుకరావాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కూసుమంచి సీఐ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు