Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : విద్యుత్ ఉద్యోగులకు పెరిగిన పని భారం..! 

Narayanpet : విద్యుత్ ఉద్యోగులకు పెరిగిన పని భారం..! 

నారాయణపేట టౌన్, మన సాక్షి:

రాష్ట్రంలో విద్యుత్ కార్మికులకు పనిభారం పెరిగిన, నిరంత విద్యుత్ సరఫరా కోసం ప్రతి కార్మికుడు అహార్నిషలు కృషి చేస్తున్నారని 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డివిజన్, నూతన సర్కిల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న జే.ఎల్.ఎం, ఎల్. ఏ.ఎల్.ఎం. , ఎల్.ఎమ్. లకు పని భారం పెరిగిందన్నారు.

ఏడు గ్రామాలకు ఓకే జే.ఎల్.ఎం. చొప్పున పని చేస్తున్నారని సాయిబాబు అన్నారు. నారాయణపేట కర్ణాటక సరిహద్దు న ఉన్నందున ఈ సర్కిల్ లో తీవ్ర కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జే.ఎల్.ఎమ్. ల నూతన రీక్రూట్ మెంట్ లో ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని అభిప్రాయం వెలిబుచ్చారు.

నారాయణపేట నూతన సర్కిల్ లో ప్రతి విభాగంలో అధికారులకు అధనపు భాధ్యతలు ఉన్నాయని స్థానిక ఎస్.ఈ. సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సర్కిల్ అయినందున ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఎవ్యరు ముందుకు రావటం ఆవేదన వెలిబుచ్చారు. ఈ ప్రాంతానికి అధికారులు వచ్ఛేల కంపెనీ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో డిస్కమ్ ప్రెసిడెంట్ వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న , అడిషనల్ సేక్రటరీ భాస్కర్ రెడ్డి , మహాబూబ్ నగర్ సర్కిల్ రీజినల్ ప్రెసిడెంట్ స్వామి, సెక్రటరీ పాండు నాయాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్యా గౌడ్ ,

మహాబుబ్ నగర్ మాజీ సెక్రటరీ శ్రీనివాస్ , విద్యుత్ అధికారులు ఎస్.ఏ.ఓ. వెంకటేశ్వర్లు , డి.ఈ. నర్సింహరావు, ఎం.ఎన్.పి. , డీ.ఈ.టి. డిఈ. శ్రీనివాస్, డి.ఈ.టి. జీతెందర్‌, ఏడిఈ. శ్రీనివాస్ , ఏఈ. అనిల్ , రఫీ, బాల్ రాజు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నారాయణపేట నూతన సర్కిల్ బాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్ ప్రెసిడెంట్ గోవింద్ రాజు , వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె.రఘు, సెక్రటరీ మొగులప్ప, అడిషనల్ సెక్రటరీ రవీంద్ర చారీ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ నజీర్ లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ బాడిలో నారాయణపేట డివిజన్ అధ్యక్షుడు మొగులప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయాక్ , డీవిజన్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ మధుసూదన్ గౌడ్లలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు