Mana Sakshi Effect : మన సాక్షి కథనానికి స్పందన.. 119 అక్రమ ఇసుక తరలింపు వాహనాల పట్టివేత… జిల్లా కలెక్టర్..!
Mana Sakshi Effect : మన సాక్షి కథనానికి స్పందన.. 119 అక్రమ ఇసుక తరలింపు వాహనాల పట్టివేత… జిల్లా కలెక్టర్..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి, ప్రతినిధి :
పెద్దపెల్లి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 21 నాటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 119 వాహనాలను నిర్బంధించి 22 లక్షల 18 వేల 790 రూపాయల జరిమాన వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..
మన సాక్షి కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం అక్రమహిష్క తరలింపు వాహనాలను భారీగా పట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న 56 ట్రాక్టర్లు, 63 టిప్పర్లను పట్టుకొని కేసులు బుక్ చేశామని, వీరి వద్ద నుంచి ఇప్పటి వరకు 22 లక్షల 18 వేల 790 రూపాయల జరిమాన వసూలు చేశామని అన్నారు.
ఇక నుంచి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ నుంచి 25 వేల రూపాయలు, టిప్పర్ నుంచి లక్ష రూపాయల జరిమానా వసూలు చేయడం జరుగుతుందని, ఇదే కాకుండా అక్రమ ఇసుక రవాణా దారుల పై సెక్షన్ 379,21 ఎంఎండిఆర్ యాక్ట్ 1957 , పీడి యాక్ట్ ల క్రింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇసుకను ఆన్ లైన్ ద్వారా సాండ్ ట్యాక్సీ నందు బుక్ చేసుకోవాలని, బుక్ చేసుకున్న 24 గంటలలో ఇసుక డెలివరీ చేయడం జరుగుతుందని, సాండ్ ట్యాక్సీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!
-
ACB : ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.30 వేలు డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం..!










