Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District Collector : విద్యార్థులతో పాటు కూర్చొని అల్పాహారాన్ని భుజించిన.. జిల్లా కలెక్టర్..!

District Collector : విద్యార్థులతో పాటు కూర్చొని అల్పాహారాన్ని భుజించిన.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

విద్యార్థులకు సూచి శుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వాహకులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాలను, బి. సి. కాలేజీ బాయ్స్ హాస్టల్ ,బీసీ గర్ల్స్ హాస్టల్స్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కిచెన్ స్టోర్ లోని ఆహార పదార్థాలను, సామాగ్రిని స్టాక్ రిజిస్టర్ను, ఫుడ్ క్వాలిటీ రిజిస్టర్ను, స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. అలాగే కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెటరీ, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, స్టాఫ్ రిజిస్టర్లను, పరిసరాలను పరిశీలించారు.

అల్పాహార సమయంలో విద్యార్థులతో పాటు కూర్చొని కలెక్టర్ అల్పాహారాన్ని భుజించారు. ఫుడ్ కమిటీ విద్యార్థులతో ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా ఆహార నాణ్యత కొనసాగించాలని ప్రిన్సిపాల్ జగదీశ్వర్,డిప్యూటీ వార్డెన్ ఇంతియాజ్ లకు కలెక్టర్ సలహా ఇవ్వడం జరిగింది.

బీసీ హాస్టల్ లో బియ్యం తనిఖీ చేసి వంటలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు మైనారిటీ అధికారి ఎం. ఎ.రషీద్, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ ఖలీల్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ,వార్డెన్ మాసూద్ అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు