Khammam : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఇంటి కోసం వచ్చి దంపతుల హత్య, చోరీ కోసం కాదు..!
Khammam : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఇంటి కోసం వచ్చి దంపతుల హత్య, చోరీ కోసం కాదు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం దారుణం జరిగింది. దంపతులను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. నేలకొండపల్లి కి చెందిన ఎర్రా వెంకటరమణ (60), కృష్ణకుమారి (58) లు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
వీరి కుమారుడు హైద్రాబాద్, కుమార్తె జగ్గయ్యపేట లో నివాసం ఉంటున్నారు. నేలకొండపల్లి లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. గత పది రోజుల క్రితం ఇరువురు మహిళలు ముసుగులు ధరించి ఇంటి అద్దె కోసం వచ్చారు. వారితో కలివిడిగా మాటలతో కలిసిపోయేలా నటించారు.
ఇళ్లు నచ్చింది.. అద్దెకు ఉంటామని కొంత అడ్వాన్స్ గా నగదు ఇచ్చారు. ఆ రోజు వారిలో కలిసి భోజనం కూడ చేశారు. ఆ తరువాత మంగళవారం అర్ధరాత్రి తిరిగి అదే మహిళలు ముసుగులు దరించి అదెకు ఉండటానికి వచ్చినటుగా నటించారు. పక్కన ఉంటున్న వారు ముసుగు ఉండటంతో గుర్తించలేదు.
తెల్లవారిన తరువాత కూడ ఉదయం 8 గంటల దాటిన బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి అద్దెకు ఉంటున్న వారు వెళ్లి చూడగా ఇరువురు విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు అనవాళ్లు చిక్కకుండా… అనుమానం రాకుండా ఇంటిచుట్టూ, ఇంట్లో మృతదేహాల పై కారం చల్లారు. పోలీసులు క్షేత్ర స్థాయి లో విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్పింటర్స్ ఆనవాళ్ల ను సేకరించారు. ఘటనా స్థలం కు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి, కారేపల్లి సీఐ లు సంజీవ్, తిరుపతిరెడ్డి లు చేరుకుని వివరాలు సేకరించారు.
దొంగతనం జరగలేదు…మృతుల ఒంటి పై ఉన్న బంగారం, నగదు చోరీ జరగలేదని పోలీసులు ధృవీకరించారు. దొంగతనం కోసం కాకుండా.. ఎందుకు జంట హత్యలు జరిగాయి అనే విషయం మిష్టరీ గా మారింది. జిల్లాలో దంపతుల హత్య తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కలకలం రేపింది. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
Nalgonda : అప్పు ఇచ్చి అడిగినందుకు హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు..!









