Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శించి తనిఖీ చేసిన సీఐ..!

కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శించి తనిఖీ చేసిన సీఐ..!

టేక్మాల్, మన సాక్షి ప్రతినిథి:

టేక్మాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం అల్లాదుర్గం సీఐ రేణుక, టేక్మాల్ ఎస్పై రాజేష్ తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మంచి భోజనం అందించాలని సిఐ రేణుక అన్నారు.

కస్తూర్బా గాంధీ హాస్టల్లో స్టోర్ రూమ్ వంట గది డైనింగ్ ఆల్ తదితర వాటిని సిఐ రేణుక సిబ్బందితో పరిశీలించారు. కూరగాయలు ఉన్నా స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్న బియ్యం కూరగాయలను సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కస్తూర్బా గాంధీ హాస్టల్ వార్డెన్ కు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.

ఆహార పదార్థాలు కూరగాయలు ఇతర సరుకులు భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిశు భ్రమైన వాతావరణంలో పరిశుభ్రతతో కూడిన భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ పాత్రలో భద్రపరచాలని వాటిపై తప్పనిసరిగా మూతలు పెట్టాలని ఏ దశలోనూ ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తంతో వ్యవరించాలని కస్తూర్బా గాంధీ హాస్టల్ వార్డెన్ కి విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.

ప్రతిరోజు భోజనం ఉండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తర్వాత కూడా విద్యార్థులకు వడ్డించడా నికి ముందు రుచి చూడాలని వంట చేసే నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం వంటనూనె ఇతర సరుకులు సరఫరా జరుగుతే అధికారుల దృష్టికి తేవాలని వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుక తెలిపారు.

నిర్లక్ష్యానికి తావివ్వకుండా రోజువారి మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి పోషకాహారం భోజనం అందించాలని కస్తూర్భా గాంధీ హాస్టల్ వార్డెన్ ఎస్ఓ బాలమణి కి అల్లాదుర్గం సీఐ రేణుక సూచించారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ ఎస్సై రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు