Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేస్తే ప్రోత్సాహం..!

District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేస్తే ప్రోత్సాహం..!

నల్లగొండ, మన సాక్షి:

నల్గొండ జిల్లాలో ఎగుమతులకు అనువైన ఉత్పత్తుల పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎగుమతుల విధానంపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు, క్లస్టర్ల అభివృద్ధికి కావాల్సిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే ఎగుమతులకు అవసరమయ్యే ఉత్పత్తుల విషయంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రోత్సాహాఁ ఇస్తామని, ఎస్ హెచ్ జి మహిళా సంఘాలు, ఉత్పత్తుల ఏర్పాటుపై ముందుకు వచ్చినట్లయితే వారికి అవసరమైన భూమిని తక్కువ రేటుకు ఇస్తామని ఆయన తెలిపారు. ఎఫ్ఐఈఓ కులకర్ణి మాట్లాడుతూ ఎగుమతులకు అనువైన పరిశ్రమల ఏర్పాటు గురించి, వాటి విధానం గురించి వివరించారు.

ఐ టి ఆర్ సి టి ఎస్ ఐ ఐ సి అధికారి క్లస్టర్ ఏర్పాటు చేసుకునే విధానం, క్లస్టర్ల గురించి తెలిపారు.ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ ,హార్టికల్చర్ డిడి సాయిబాబా, నాబార్డ్ , డిఆర్డిఓ అధికారులు ,టి ఎస్ ఐ ఐ సి అధికారులు, కట్టంగూరు ఎఫ్ టి ఓ అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, రైస్ మిల్లర్ల అధ్యక్షులు, రైస్ మిల్లర్లు, పవర్లూమ్ అసోసియేషన్ అధ్యక్షులు, స్వయం సహాయక మహిళా సంఘాల కోఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు