Breaking Newsక్రైంతెలంగాణసినిమాహైదరాబాద్
Allu Arjun : హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!
Allu Arjun : హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!
మన సాక్షి, హైదరాబాద్ :
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు శుక్రవారం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇక కాసేపట్లో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఈనెల 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా ఈ విషయంలో అల్లు అర్జున్ ను A11గా చేర్చారు. అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారుగా రెండు గంటల పాటు విచారణ చేపట్టారు.
అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కాగా మరి కొద్ది సేపట్లో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
MOST READ :
-
Allu Arjun : హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలింపు..!
-
Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్..!
-
District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేస్తే ప్రోత్సాహం..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. లేటెస్ట్ అప్డేట్..!









