District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
మన సాక్షి, కొండమల్లేపల్లి :
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల, పరిశీలన, కార్యక్రమాన్ని హడావిడిగా కాకుండా, జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి సర్వే బృందాలకు ఆదేశించారు. బుధవారం కొండమల్లెపల్లి మండలంలోని గుర్రపు తండా గ్రామపంచాయతీ పరిధిలో, దర్గా తండాలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను తనిఖీ చేశారు.
ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను ఫోటోతో సహా ఇల్లు మొత్తం కవర్ అయ్యే విధంగా ఫోటోలు తీయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఉండి వలస వెళ్లిన వారికి ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం తెలియజేసి,తక్షణమే గ్రామానికి వచ్చిన వివరాలు ఇచ్చే విధంగా సమాచారం అందించాలని, చెప్పారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా, ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను ఎవరైనా గతంలో,దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
సర్వే సందర్భంగా పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని ఎవరైనా దరఖాస్తుదారు అందుబాటులో లేనట్లయితే అప్లోడ్ చేసి అనంతరం ఎట్టి పరిస్థితులలో, ఆ వివరాలు అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఎంపీడీవో,తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. చింతపల్లి ఎంపీడీవోకు షోకాజ్..!
-
Ration Dealers : నీరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!









