Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : గ్రేవ్ ఫైల్స్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

Narayanpet : గ్రేవ్ ఫైల్స్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోగురువారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట సర్కిల్ ఆఫీస్ ను తనిఖీ చేశారు. సర్కిల్ ఆఫీస్ లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులు, కేసుల పురోగతి పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలని సూచించారు.

కేసుల దర్యాప్తు, వర్టికల్స్ పనితీరు కేసుల వివరాలను ఆన్లైన్ నిర్వహణ వంటి వాటిని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పోలీస్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా వచ్చిన కానిస్టేబుల్స్ అందరు పోలీస్ స్టేషన్లో ప్రతి వర్టికల్స్ పై అవగాహన కలిగి ఉండి రొటేషన్ వైస్ గా అన్ని విధులు నిర్వర్తించాలని సూచించారు.

అలాగే సాంకేతిక వ్యవస్థపై దృష్టి సారించాలని, పోలీస్ శాఖ లో వస్తున్న నూతన ఆప్స్, సి సి టి ఎన్ ఎస్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పాత వాహనాలను, కండం అయిన వాటిని పోలీస్ హెడ్ క్వాటర్స్ కు పంపించాలని తెలిపారు.

జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని తెలిపారు. పాత నేరస్థులపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని, ఆకస్మికంగా నాక బంది నిర్వహించాలని మరియు ఆరుబయట మద్యం సేవించే వారిపై, మహిళలను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఫిర్యాదుదారులకు కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఎప్పటికప్పుడు బాధితులకు వివరించాలని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయాలని సిబ్బందికి తెలిపారు. ఫిర్యాదులపై త్వరగా స్పందించకపోయిన, కేసుల దర్యాప్తులో అలసత్వం చూపిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పిర్యాదుదారుడు నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేసేలా స్నేహపూర్వక వాతావరణ కల్పించాలి అన్నారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఫ్రీ ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయాలని అన్నారు. దొంగతనాల నివారణ కోసం సీసీ కెమెరాలను పెంచడం మరియు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మహిళల రక్షణ కోసం, సైబర్ నేరాలపై షీ టీమ్స్, లోకల్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు జరగకుండా విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణ దేవ్, రేవతి, ఏఎస్సైలు లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు