Ap News : అభివృద్ధి పథంలో ఏపీ ముందంజ..!
Ap News : అభివృద్ధి పథంలో ఏపీ ముందంజ..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుందని,గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి, ప్రతి గ్రామానికి రోడ్లు,నీరు,విద్యుత్తు పరిశుభ్రత పాటించేలా చర్యల చేపడుతున్నామని రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
శుక్రవారం నందలూరు మండలం,టి వి పురం నందు పర్యటిస్తూ ఆయన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన అంటే దోచుకోవడం కాదని,ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే నిజమైన పాలనా అనిపించుకుంటుందని,అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఎలా నడుస్తుందో తెలుసుకోవాలనీ ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్,మరియు పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్,మండల పార్టీ అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య, తెలుగు అధికార ప్రతినిధి పరశురాం నాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,గ్రామ అధ్యక్షులు శ్రీనివాసులు, గోపాల్ రాజు, రామాంజి, గంగన్నపల్లె శ్రీనివాసులు,సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









