Nalgonda : ఈ ముఠా మామూలుది కాదు.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!
Nalgonda : ఈ ముఠా మామూలుది కాదు.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!
మన సాక్షి కొండమల్లేపల్లి;
వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న ముఠా ను కొండ మల్లేపల్లి పోలీస్ లు అరెస్టు చేశారు. పూర్తి వివరాలలోకి వెళ్తే నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండలం లో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్టు చేశామని డి ఎస్పీ గిరిబాబు వివరాలు వెల్లడించారు.
ఈ మధ్య కాలంలో కొండమల్లేపల్లి, చింతపల్లి, గుడిపల్లీ మండలాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యలో ఎస్పీ శరత్ చంద్ర పహార్ నేతృత్రంలో కొండమల్లేపల్లి పోలీస్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞనంతో దొంగల ముఠాను గుర్తించారు.
శుక్రవారం ఉదయం నమ్మదగిన సమాచారం తో వాహనాలు తనఖిలలో భాగంగా కొండమల్లేపల్లి చౌరస్తాలో నల్గొండ జిల్లా చింతపల్లి మండల నీకి చెందిన భక్తోజు శివ, ఆరెండు గౌతమ్, వరికుప్పల అశోక్,సురకరపు శివ పట్టుబడ్డారు వ్యసనాలకు బానిసలై డబ్బు ల కోసం ఫేక్ తాళం చెవులు సంపదిచికొని, కొండ మల్లేపల్లి, గుడిపల్లి చింతపల్లి , యాచారం, మాడుగుల మండల లో 10 లక్ష ల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను దొంగిలించినరని వాటిని స్వాధీన పర్చుకున్నమని తెలిపారు.
ఇట్టి కేసుని చేదనలో చాకచక్యంగా నిర్వహించి పట్టుకున్న సీఐ ధనుంజయ, ఎస్ ఐ రామ్మూర్తి, నరసింహులు, క్రైమ్ సిబ్బంది హేము, భాస్కర్, వెంకటేష్, శేఖర్,రెడ్డి, లక్ష్మయ్య రమేష్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందచేసినారు.
MOST READ :









