District collector : అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శాఖల వారీగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆస్పీరేషన్ నర్వ బ్లాక్, నారాయణపేట జిల్లా పై జిల్లా అధికారులు, అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.
ఈనెల 26న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామం లో పర్యటించనున్నారని, ఆయా గ్రామాలతో పాటు, నర్వ మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆయా గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి ఎంత మేర చేకూరిందనే వివరాల నివేదికను అధికారులు శాఖల వారీగా సిద్ధం చేసుకుని ఉండాలని, పూర్తిస్థాయి రిపోర్ట్ ను మంగళవారం వరకు తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆస్పీరేషన్ నర్వ బ్లాక్ లో ప్రభుత్వ శాఖల అధికారులు 40 ఇండికేటర్ల వారీగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారులు అన్ని వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నర్వ మండలంలోని పంచాయతీల వారీగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అలాగే విద్యా, వైద్యం, వ్యవసాయ, సంక్షేమ, ప్రణాళిక శాఖల అధికారులు సమగ్ర వివరాలతో కూడిన రిపోర్ట్ లను సమర్పించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ అధికారులు సమిష్టిగా పనిచేసి కేంద్రమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల,
డి ఆర్ డి ఓ మొగులప్ప,డి. పి ఓ. కృష్ణ, డిప్యూటీ సి. ఈ. ఓ. జ్యోతి,పీ ఆర్ ఈ ఈ హిర్యా నాయక్, డి. ఈ. ఓ. గోవిందా రాజులూ,వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డి డబ్ల్యు ఓ జయ, జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మమ్మద్ ఖలీల్,షెడ్యూల్ కులాల అభిరుద్ది అధికారి ఉమాపతి,ఫిషరీస్ అధికారి రెహమాన్,సివిల్ సప్లై అధికారి సుదర్శన్, అధికారులు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : రెండు రోజుల్లో పసిడి ధరలు.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!









