District Collector : నో సండే, నో హాలిడే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District Collector : నో సండే, నో హాలిడే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఈ నెల 29 సండే నో హాలిడే అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సర్వే సిబ్బంది కి తేల్చి చెప్పారు. నారాయణపేట జిల్లా కేంద్ర పురపాలక సంఘం పరిధిలోని 7, 8 వార్డులలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను శనివారం కలెక్టర్ పర్యవేక్షించారు. ముందుగా 8 వ వార్డు అశోక్ నగర్ లో పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ సర్వే ఎందుకు వేగంగా చేయడం లేదని వార్డు ఆఫీసర్ ను ప్రశ్నించారు.
సర్వర్ రావడంలేదని వార్డ్ ఆఫీసర్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సరిహద్దులో గల కృష్ణ, మాగనూరు లాంటి ప్రాంతాలలో సర్వర్ సమస్య లేదని, జిల్లా కేంద్రంలోనే సర్వర్ ఎందుకు రావడం లేదన్నారు. కారణాలు చెప్పకుండా సర్వేను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వారిని ఇక్కడికి రప్పించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
మారుమూల ప్రాంతాలలో సర్వేను ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే, పురపాలక సంఘంలో వార్డు ఆఫీసర్లు ఉదయం 10 గంటల తరవాతే సర్వేకు వెళ్తున్నారని, ఎవరెవరు ఎప్పుడు సర్వేకు వెళ్తున్నారో తాను ఆన్ లైన్ లో చూస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచే సర్వే ప్రారంభించాలని, ఆ సమయంలో దరఖాస్తుదారులు అందుబాటులో ఉంటారని సర్వర్ సమస్య కూడా ఉండదని కలెక్టర్ తెలిపారు.
వార్డుల వారీగా సర్వే రిపోర్ట్ ను చూసిన కలెక్టర్ పట్టణంలోని వార్డులలో సర్వే ఇంత నెమ్మదిగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సునీత పై అసహనం వ్యక్తం చేశారు. లోయెస్ట్ పర్ఫామెన్స్ ఉన్న వార్డు అధికారులకు మెమోలు జారీ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం 7 వ వార్డు పరిధిలోని భీమండి కాలనీలో కొనసాగుతున్న సర్వేన పరిశీలించిన కలెక్టర్ ఆ వార్డు సర్వే కేవలం 20 శాతం ఉండటంపై కమిషనర్, వార్డ్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని మిగతా పురపాలక సంఘాల కంటే జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంలోనే నెమ్మదిగా సాగుతుందని, సర్వేను వేగవంతం చేయాలన్నారు.ఈనెల 29 సండే అయినా.. నో హాలిడే అని రెండు రోజుల్లో సర్వే వంద శాతం పూర్తయ్యేలా చూడాలని కమిషనర్, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
MOST READ :
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Youtube Videos : ఇంటర్నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
-
Kamareddy : ముగ్గురి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పోస్టుమార్టం లో సంచలనం..!










