Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

2024 Google Top Search in India : 2024 గూగుల్‌లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!

2024 Google Top Search in India : 2024 గూగుల్‌లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!

మనసాక్షి:

ఇప్పుడు ప్రతీ అవసరానికి…ఏ విషయం తెలుసుకోవాలన్నా అందరూ గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆటలు, రాజకీయాలు, సినిమాలు ఏ రంగం గురించి తెలుసుకోవాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. అయితే 2024 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన టాప్‌ విషయాలను గూగుల్‌ వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2024లో భారతీయులు అధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన అంశంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో’T20 వరల్డ్ కప్, భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ రిజల్ట్స్ 2024, ఒలింపిక్స్ 2024 నిలిచాయి. ఎక్సన్స్సివ్ హీట్​, రతన్ టాటా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ అంశాలను కూడా భారతీయులు ఎక్కువగా వెతికినట్టు గూగుల్‌ ప్రకటించింది.

అలాగే ఎంటర్‌ టైన్‌మెంట్‌ విషయంలో స్త్రీ 2 సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హను-మాన్, కల్కి సినిమాల గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికారట.

రాజకీయ రంగం : 

రాజయాల్లో మొదటిసారి ప్రవేశించి అందరినీ ఆకట్టుకున్న వినేష్‌ ఫోగట్ గురించి చాలా వెతికారు. హర్యానాలోని జులానా స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వినేస్‌ ఫోగట్‌. అందుకే ఆమె గురించి తెలుసుకోవాలని భారతీయుల్లో ఆసక్తి నెలకొంది.

తర్వాత తెలుగు సినిమా హీరోగానే కాకుండా…రాజకీయ నాయకుడిగా తన సత్తా చాటుతున్న పవన్‌ కళ్యాణ్‌ గురించి ఎక్కువగా గూగుల్ సెర్ఛ్‌ చేశారు. జనసేన పార్టీ అధినేత అయిన పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ, బీజేపీలతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో కీలక పాత్ర పోషించారు.

నితీష్‌ కుమార్‌ గురించి కూడా బాగా గూగుల్‌లో బాగా వెతికారట. బిహార్‌ రాజకీయ నాయకుడిగానే కాకుండా…ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా నితీష్‌కు ప్రాధాన్యత పెరిగింది.
చిరాగ్ పాశ్వాన్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. 2024 ఎన్నికల్లో బిహార్‌లో గెలిచారు. చిరాగ్ పాశ్వాన్‌ నటుడు కూడా కావడం కలిసి వచ్చింది.

లోక్‌ సభ ఎన్నికల సమయంలో భారతీయులు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తితో గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. How to vote Lok Sabha అనే విషయాన్ని ఎక్కువగా శోధించారు.

2024 గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన వ్యక్తుల విషయంలో… హార్దిక్‌ పాండ్యా, రతన్‌ టాటాలు క్రికెటర్‌ శశాంక్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత నటి పూనమ్‌ పాండే స్థానం సంపాదించింది. చనిపోయానంటూ నాటకమాడి ఎక్కువ మందితో గూగుల్‌లో వెతికించుకుంది. ఆ తర్వాత అంబానీ కోడలు… అనంత్‌ అంబానీ భార్య రాధిక మర్చంట్‌ గురించి గూగుల్‌ లో ఎక్కువగా వెతికారట.

ట్రావెల్‌ రంగంలో అజర్‌ బైజాన్‌ అనే ప్రదేశం గురించి ఎక్కువగా వెతికారు. మీమ్స్‌లో థ్రోనింగ్‌ డేటింగ్‌, ఆరెంజ్‌ పీల్‌ థియరీ, జెన్ జడ్‌ బాస్‌ పదాలను ఎక్కువగా వెతికారట. వీటితో పాటు ‘Pookie’, ‘demure’, ‘Moye Moye’ లాంటి మీమ్స్‌ పదాలు జనాదారణ పొందాయి.

వాతావరణం, ఆరోగ్యం విషయంలో excessive heat​, AQI near me అనే పదాలను గూగుల్లో ఎక్కువగా వెతికారట.

షోస్‌:

షోస్‌లో హీరామండి గూగుల్ సెర్చ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మీర్జాపూర్, పంచాయత్‌, కోటా ఫ్యాక్టరీ, ది లాస్ట్‌ ఆఫ్‌ అస్‌, క్వీన్‌ ఆఫ్‌ టియర్స్‌, మ్యారీ మై హస్బండ్‌ నిలిచాయి.

క్రికెట్‌ :

క్రికెట్‌ మ్యాచ్‌ల విషయానికి వస్తే…ఇండియా- ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను బాగా చూశారు. వినేష్‌ ఫోగట్‌, హార్దిక్‌ పాండ్యా, శశాంక్‌ సింగ్‌, అభిషేక్‌ శర్మ, లక్ష్యసేన్‌ల గురించి తెలుసుకోవడానికి ఇండియన్స్‌ ఆసక్తి కనబరిచారని గూగుల్ తెలిపింది. పీపుల్ సెర్చ్‌లో ఫిఫ్టీ పర్సంట్‌ ఆటగాళ్ళ గురించే వెతికారట.

సాంగ్స్‌ :

పాటల విషయానికి వస్తే…2024లో గూగుల్ సాంగ్‌ ఫైండర్‌లో ఏ తునే క్యా కియా, యేరాతే యే మౌసమ్‌, నాదానియన్, హుస్న్‌ పాటలను ఎక్కువగా వెతికారట.

ట్రావెల్‌ ప్లేస్‌ : 

యాత్ర ప్రదేశాల్లో…అజర్‌ బైజాన్‌, బాలి, మనాలి, జైపూర్లు గూగుల్‌లో వెతికిన టాప్‌ ప్లేస్‌లుగా నిలిచాయి.

వంటలు :

వంటకాల విషయంలో మన మామిడికాయ పచ్చడి, ఉగాది పచ్చడిలను కూడా ఎక్కువగా వెతికినట్టు గూగుల్‌ తెలిపింది. అలాగే పోర్న్‌ స్టార్ మార్టిని, ఫ్లాట్‌ వైట్‌, చమ్మంత, ఓనం సధ్య వంటలకాలను కూడా భారతీయులు గూగుల్‌లో బాగా వెతికారట.

Reporting :

MahipalReddy, Hyderabad

MOST READ :

 

 

మరిన్ని వార్తలు