Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

THIRUMALA : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గోవిందుడు దర్శనానికి 22 గంటలపైనే..!

THIRUMALA : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గోవిందుడు దర్శనానికి 22 గంటలపైనే..!

తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు… డిసెంబర్‌ 30 నుంచి జనవరి 23 వరకు

మనసాక్షి, వెబ్ డెస్క్:

తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని రోజులుగా అస్సలు తగ్గడం లేదని అధికారులు తెలిపారు. ప్రతి రోజు 29 కంపార్టుమెటులో నిండిపోతున్నాయి. రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని అధికారులు అన్నారు.

ఈ నెలలో ఎక్కువగా సెలవులు రావడంతో ప్రతి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దాదాపు 70 వేల మంది భక్తులు వస్తున్నారట. నిత్యం 25 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా…భక్తుల కానుకలతో నిత్యం 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని అధికారులు అన్నారు.

వచ్చే సంక్రాంతికి సెలవులతో పాటు శ్రీవారి అధ్యయన ఉత్సవాలు జరగనుండటంతో భక్తుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా…అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి ఏడాది చివరలో… 450కి పైగా ఉత్సవాలు తిరుమలలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే అధ్యయనోత్సావాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. స్వామివారి సన్నిధిలో…దివ్య ప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ ఉత్సవాలు… ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు మొదలవుతాయి. ఈ డిసెంబర్‌ 30 నుంచి 2025 జనవరి 23 వరకు నిర్వహించే ఈ అధ్యయనోత్సవాలు మొత్తం 25 రోజులపాటు జరుగుతాయి.

MOST READ :

మరిన్ని వార్తలు