నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తున్న మన సాక్షి.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!
నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తున్న మన సాక్షి.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!
పత్రికారంగంలోనే ట్రెండ్ సెట్టర్ గా మారిన ‘మన సాక్షి ‘
దమ్మపేట, మన సాక్షి :
నిజాలను నిర్భయంగా జనాల్లోకి “మన సాక్షి” దినపత్రిక తీసుకెళ్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు శుక్రవారం మన సాక్షి 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికారంగంలోనే ట్రెండ్ సెట్టర్ గా మారిన ‘మన సాక్షి ‘ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కచ్చితత్వం తో పాటు అత్యంత వేగంగా వార్తలను పాఠకులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. మన సాక్షి చాలా తక్కువ సమయంలోనే లక్షలాది మంది పాఠకుల ఆదరణను సంపాదించుకుదన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ల ద్వారా తాజా సమాచారం అందించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మరియు దమ్మపేట మండలాల బూత్ కమిటీ ఇన్చార్జ్ కక్కిరాల రమేష్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు రొయ్యల కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల రాంబాబు, మండల పాస్టర్ దేవయ్య, గవర రాము,అశ్వరావుపేట మన సాక్షి ఇంచార్జ్ గోపవరపు షణ్ముఖ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు
MOST READ :









