Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : గుర్తుతెలియని వాహనం డీకొని వ్యక్తి దుర్మరణం..!

Miryalaguda : గుర్తుతెలియని వాహనం డీకొని వ్యక్తి దుర్మరణం..!

వేములపల్లి, మన సాక్షి :

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లుల సమీపంలోని చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులోని నార్కట్పల్లి – అద్దంకి రహదారి సమీపంలో ఉన్న మహర్షి రైస్ మిల్లు లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దోరగ సహాని (45) రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎరుపు రంగు కారు ఢీ కోట్టింది.

అట్టి కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగిన దోరగ సహాని అక్కడికక్కడే మృతి చెందినాడు. అట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించి వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు