Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

గంటలు తరబడి కరెంటు కోతలు.. ప్రతిరోజు ఇదే తంతు..!

గంటలు తరబడి కరెంటు కోతలు.. ప్రతిరోజు ఇదే తంతు..!

కొండమల్లేపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి పట్టణ ప్రజలకు కరెంటు తిప్పలు రోజు రోజుకి ఎక్కువ అయితున్నాయి.రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో, ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితి. పట్టణ పరిధిలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకి చీటికిమాటికి కరెంటు పోవడం వల్ల వ్యాపారస్తులకు తీరని నష్టం జరుగుతుంది. ప్రజలు విలవిలాడుతున్నారు.

గత ప్రభుత్వం కాలంలో కరెంటు కష్టాలు లేవని ఈ ఏడాది కాలంలో కరెంటు వల్ల కష్టాలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు రాత్రి టైం లో వాహనదారులకు చీకటిగా ఉండటం వలన రోడ్డు దాటుతున్న పాదరక్షకులకు కనిపించకపోవడంతో యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్డుమీద అనుకోకుండా కుక్కలు రావడం వల్ల ఇబ్బంది జరుగుతుంది.

డివైడర్ మీద ఉన్న ఒక్కటి స్టీల్ లైట్స్ వెలగడం లేదు అక్కడక్కడ పూర్తిగా వెలగడం లేదు పట్టించుకోని అధికారులు కరెంటు ఏఈ నీ సంప్రదించగా బ్రేక్ డౌన్స్ అనే రిపేర్లను మెయిన్ లైన్ రిపేర్ అని రాత్రి వేళలో కూడా రిపేర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు