Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంవిద్య

Holidays : విద్యార్థులకు మారిన సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే..!

Holidays : విద్యార్థులకు మారిన సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా ప్రజలు జరుపుకుంటారు. పంటలు ఇళ్ళకు వచ్చిన వేళ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ పండుగను అద్భుతంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో దసరా, సంక్రాంతి పండుగలకు విద్యాసంస్థలకు పది రోజులకు పైగానే సెలవులు ఉండేవి.

రాష్ట్ర విభజన తర్వాత సెలవుల్లో తేడాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ ఆంధ్రులకు సంబంధించిందని తెలంగాణలో సెలవుల కుదింపు జరిగింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ 13, 14 తేదీలలో వస్తుంది. అయితే విద్యాశాఖ సెలవుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంక్రాంతి సెలవులపై తర్జనభర్జన నిర్వహించిన అనంతరం ఫైనల్ గా సెలవులపై నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షిల దృష్ట్యా సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరుగుతున్నాయి. ఫైనల్ గా జనవరి 10వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయి. 20వ తేదీన విద్యాసంస్థలు పున ప్రారంభం అవుతాయ

ఇదిలా ఉండగా తెలంగాణలో మాత్రం విద్యాశాఖ జనవరి 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. 19వ తేదీన పాఠశాలలు పున ప్రారంభమవుతాయి. హైదరాబాదులో హాస్టళ్లు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బంద్ చేయాలని నిర్ణయించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు