Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన..!
Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన..!
తిరుపతి, మన సాక్షి :
తిరుపతిలో జరిగిన తొక్కి సలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. మృతుల్లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు.
అదేవిధంగా స్విమ్స్ లో క్షతగాత్రులను కూడా వారు పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా..? కుట్రా..? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఒకేసారి గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో క్షతగాత్రులు డిశ్చార్జ్ అవుతారని ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!
-
Pushpa 2 : పుష్ప సాంగ్ కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూడాల్సిందే..!
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!









