Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!

Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గత కొంత కాలంగా మిర్యాలగూడ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆచూకీ చెబితే తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు డి.ఎస్.పి రాజశేఖర్ రాజు పేర్కొన్నారు. ఇద్దరి దొంగలకు సంబంధించిన ఫోటోలను ఆయన విడుదల చేశారు. వేముల కోటేష్, భూష్మి శ్రీకాంత్ ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.

వీరు మిర్యాలగూడ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యక్తుల సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును అని తెలియజేశారు. సమాచారం ఇవ్వవలసిన వారు ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చును.

రాజశేఖర్ రాజు మిర్యాలగూడ డి.ఎస్.పి

 

మిర్యాలగూడ డి.ఎస్.పి 8712670206, మిర్యాలగూడ సిఐ 8712670151, మిర్యాలగూడ టౌన్ -1 ఇన్స్పెక్టర్ 87126701494, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ 8712670150, హాలియా సీఐ 8712670 152, నాగార్జునసాగర్ సిఐ 8712670153 నెంబర్లతో పాటు డయల్ 100 కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని ఆయన కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు