Miryalaguda : ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. వ్యక్తికి జైలు శిక్ష..!
Miryalaguda : ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. వ్యక్తికి జైలు శిక్ష..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసి గాయపరిచినందుకు వ్యక్తికి జైలు శిక్ష పడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగర్జున తెలిపిన వివరాల ప్రకారం..
గత నెల 18 వ తారీఖున మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ లో హైదరాబాదు- మిర్యాలగూడ డిపో బస్సు ను ప్లాట్ ఫాం-03 మీద కు బస్సు డ్రైవర్ గండికోట శ్రీనివాస్ ప్రయాణీకులను తీసుకెళ్ళుటకు తీసుకువస్తుండగా ప్లాట్ ఫాం మీద నూనావత్ అఖిల్ తన బైక్ ని అడ్డంగా పెట్టాడు.
సదరు బస్ డ్రైవర్ ప్రక్కకు తీయమన్నందుకు డ్రైవర్ ను దుర్భాషలడుతూ తన యొక్క విధులకు ఆటంకం కలిగించి దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. కాగా నునావత్ అఖిల్ ను శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ వారు అరెస్టు చేసి కోర్టులో హజరు పరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. యస్.ఐ రాంబాబు, పి.సి లు లక్ష్మణ్, సమద్ లు రైటర్ లు అక్బర్, రామకృష్ణ, నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!
-
Nalgonda : తాపీ మేస్త్రిగా తండ్రి.. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైన కొడుకు..!









