రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్.. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..!
రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్.. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..!
టేక్మాల్, మన సాక్షి ప్రతినిధి:
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రూ.15వేలకు బదులుగా రూ 12వేలు ఇస్తామని రైతన్నకు వెన్నుపోటు పొడిచిన వైఖరిని నిరసిస్తూ ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టేక్మాల్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాసి ఇచ్చిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ,విఫలమైందన్నారు.
మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రూ. 2లక్షల రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ ఇప్పటికి చాలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబందు,కేసీఆర్ కిట్టు,కల్యాణ లక్ష్మి, వస్తలేదన్నారు. ఈ వర్షకాలం వరి ధాన్యం కొనుగోలులో సగానికి పైగా దాన్యం దళారుల పాలైందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24గంటలు కరెంటును ఇచ్చామన్నారు. అలాగే ఇప్పుడు ఇస్తామంటున్న రైతు భరోసా కూడా కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన తప్ప రైతుల శ్రేయస్సు కోసం చేసింది కాదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ఎంఏ సలీం, నాయి కోటి భాస్కర్, బోయిని నారాయణ, గంధం పౌలు, కమ్మరి సిద్దయ్య, బోరంచ సాయిలు, రమేష్ నాయక్, బొబ్బిలి సుధాకర్, రాఘవేందర్, మహేందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు..
MOST READ :









