పండుగ పూట విషాదం.. నల్లగొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం..!
పండుగ పూట విషాదం.. నల్లగొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం..!
మనసాక్షి, కొండమల్లేపల్లి :
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాదు రోడ్డు పైపు నుంచి మల్లేపల్లి పట్టణ కేంద్రానికి బైక్ మీద వెళ్తున్న సూరే పల్లి గ్రామం పీఏ పల్లి మండలంనికి చెందిన మరపల్లి ప్రేమ్ కుమార్ కొండమల్లేపల్లి పైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ తాకడంతో ఇద్దరు మృతి చెందడం జరిగింది. ప్రేమ్ కుమార్ అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది.
ప్రేమ్ కుమార్ తో బైక్ వెనుకాల ఉన్న మృతుడు ఇంకా ఎవరో తెలియాల్సి ఉంది. ప్రేమ్ కుమార్ గతంలో హైదరాబాద్లో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేయడం జరిగింది అని తెలిపారు. సోమవారం రోజే కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చిలకమర్రి సమీపంలో ఉన్న ఆయిల్ కంపెనీలలో జాయిన్ కావడం జరిగింది.మృతుడు తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం..
సోమవారం రోజే ఆయిల్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. అంత లోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం జరిగింది అని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!
-
Rythu : తెలంగాణ రైతులకు కేంద్రం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్..!
-
WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!









