తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

సూర్యాపేట రూరల్, మన సాక్షి :

సాగు చేయని భూములను క్షేత్ర స్థాయి పర్యాటనలలో గుర్తించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నుంచి గ్రామాల వారీగా జరిగే క్షేత్ర స్థాయి పర్యటనల వివరాలను పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ జనవరి 16 నుండి 20 వరకు గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ సర్వే నెంబర్ ప్రకారం సాగు చేయని భూములను గుర్తించాలన్నారు.సాగు చేయని భూములలో రాళ్లు, గుట్టలును సర్వేయర్ ద్వారా వివరాలు సేకరించాలని, పట్టణం లోని లే అవుట్ లు, నాలా గా మార్చిన భూములను, ఇండస్ట్రీ లకి సంబందించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ ద్వారా సేకరించాలని సూచించారు.

సాగు చేయని భూముల వివరాలను జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో తెలియపర్చి వారిని రైతు భరోసా పథకం కు అనర్హలుగా గుర్తించాలని సూచించారు.తదుపరి సాగు చేసే ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలను రైతు భరోసా పథకం క్రింద ప్రభుత్వం అందెజెస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి , డిప్యూటీ తహసీల్దార్ సుక్మిద్దీన్, మండల వ్యవసాయ అధికారి సందీప్, సర్వేయర్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు