Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధం.. జిల్లా కలెక్టర్..!

District collector : ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధం.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నదని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకుని నమోదు చేసుకొని ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ నుంచి సత్య నారాయణ చౌరస్తా వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీలో జిల్లా అధికారులు,విద్యార్థులు పాల్గొని ప్ల కార్డులు చేతబట్టి మన ఓటు – మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సత్య నారాయణ చౌరస్తా లో విద్యార్థులంతా మానవహారంగా నిల్చున్నారు. ఆర్డీవో రామచందర్ నాయక్ ర్యాలీలో పాల్గొన్న వారందరిచేత ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరుగా నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.

ప్రతీ సంవత్సరం జిల్లాలో స్పెషల్ సమ్మర్ రివిజన్ నిర్వహించి చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించి, కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు నాన్ ఎలక్షన్ సిజన్ లోనూ ప్రతీ ఏటా ఓటరు జాబితాలను అప్ డేట్ చేయడం జరుగుతుందన్నారు. కేవలం ఎన్నికలకు ముందే జాబితాలో చేర్పులు మార్పులు చేయడంతో పొరపాట్లు జరిగే అవకాశం ఉందన్నారు.

ప్రతి సంవత్సరం జనవరి 25న అవగాహన కల్పించడానికిజాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్ డబ్లూ ఈ ఈ పీ (స్వీప్) కార్యకలాపాలలో భాగంగా పాఠశాల కళాశాలల స్థాయిలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తక్కువ నమోదు అవుతుందన్నారు.

గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. అధికారులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా ఇటీవలే ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజ్, పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రాలనూ అందజేసి అభినందించారు.

విద్యార్థులతోపాటు గత ఎన్నికలలో కష్టపడి పని చేసిన జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బందికీ కలెక్టర్ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే 90 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న యువతి, యువకులకు కలెక్టర్ ఓటరు గుర్తింపు కార్డులను ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డిప్యూటీ సీఈవో జ్యోతి, డిఆర్డిఓ మొగులప్ప, డి.ఎస్.పి నల్లపు లింగయ్య, డిఇఓ గోవిందరాజులు, సీ సెక్షన్ అధికారులు అఖిల ప్రసన్న, సిఐ శివ శంకర్, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు సునీత, భోగిశ్వర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  3. TG News : గ్రామ సభల్లో చదివే జాబితా.. తుది జాబితా కాదు..!

  4. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  5. Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

మరిన్ని వార్తలు