Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!
Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
విద్యార్థులకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలియజేయనున్నవి. దాంతో విద్యార్థులు ఎగిరి గంతేనున్నారు. ఈ నెలలోనే వరుసగా రెండు రోజులపాటు సెలవులు రానున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత వరుస సెలవులు ఫిబ్రవరిలో రావడం వల్ల విద్యార్థులు ఆనందంలో ఉన్నారు. ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు రావడంతో పాటు మరో రెండు రోజులు కూడా అదనంగా సెలవులు రానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది. ఎమ్మెల్సీ పోలింగ్ దృశ్య పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, స్కూల్ టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
దాంతో ఈనెల 27న కూడా సెలవు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి పండుగ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వనున్నారు. వరుసగా 26, 27వ తేదీలలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
ఏపీలోనూ ఎన్నికలు :
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగడంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..!
-
Miryalaguda : మోడల్ స్కూల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.. కీలక ఆదేశాలు..!
-
Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
-
అప్పుడే మొదలైన వేసవి తాపం.. పూర్తిగా తగ్గిపోయిన చలి..!









