అప్పుడే మొదలైన వేసవి తాపం.. పూర్తిగా తగ్గిపోయిన చలి..!
అప్పుడే మొదలైన వేసవి తాపం.. పూర్తిగా తగ్గిపోయిన చలి..!
• 34 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
• అడుగంటుతున్న భూగర్భ జలాలు..
• వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
• ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఎలా అనే ఆందోళన..
నిజామాబాద్ జిల్లా భీంగల్, మన సాక్షి
శివరాత్రితో చలి శివ శివా.. అంటూ వెళ్ళిపోతుందనేది పురాతన కాలంగా వస్తున్న ఓ సామెత. శివరాత్రికి 20 రోజుల పైనే సమయం ఉన్నప్పటికి చలి జాడ లేకుండా ముందే పోయింది. జోరుగా చలి ఉండాల్సిన సమయం ఇది. చలికాలం ఇంకా ముగియనే లేదు. కానీ వాతావరణం ఒక్కసారిగా మారిపో యింది. గడిచిన వారం పది రోజులుగా వేడి పెరిగిపోయింది. రాత్రి వేళల్లో చలి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.
ఈసారి చలికాలం సీజన్ ఏ మాత్రం జనాన్ని వణికించలేకపోయింది. ఉదయం 10 దాటితే ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం పూట రోడ్లమీద నిలువ లేని పరిస్థితి. అప్పుడే ఎండలు ముదుగుతుండడంతో రాబోయే వేసవి సీజన్ లో పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది.
ఎండ వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రమాదగంటికలు అప్పుడే మోగుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. క్రమంగా తగ్గాల్సిన ఒక్కసారిగా పడిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
దీంతో వాతావరణ సమతుల్యత లోపించి జనాలు తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు భూగర్భ జలాలు భారీగా అడుగంటడం, విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడటంతో రాబోయే వేసవిపై భయం పట్టుకుంటుంది. నిన్న మొన్నటి వరకు 25 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గడిచిన నాలుగైదు రోజులుగా 34 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏంటి అనే ఆందోళన నెలకొంది.
విద్యుత్ సరఫరాలో అంతరాయం :
ఒకవైపు ఎండలు రోజురోజుకు ముదురుతుంటే విద్యుత్ సరఫరా లో అంతరాయం చింతను కలిగిస్తుంది. వేడి పెరగడంతో విద్యుత్ వినియోగం అప్పుడే ఎక్కువైంది. మొన్నటి వరకు చలికాలం ఉండడంతో కూలర్లు ఫ్యాన్లు ఏసీలు వాడకం లేకుండా పోయింది. వ్యాపార వాణిజ్య సంస్థల్లో కూడా అంతగా విద్యుత్ వాడకం లేదు.
దీంతో విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. గడిచిన వారం రోజులుగా ఎండలు మండుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. అప్పుడే ఇళ్లల్లో వ్యాపార సంస్థల్లో కూలర్లు, ఏసీలు మొదలయ్యాయి. చల్లని పానీయాల వినియోగం పెరిగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుంది. విద్యుత్ కోతలతో జనం అప్పుడే ఇబ్బందుల పాలవుతున్నారు.
రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ వాడకం పెరగనుంది. విద్యుత్ కోతలు ఇప్పుడే ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో ఎలా ఉండబోతుందని టెన్షన్ మొదలైంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు అనివార్యం అవుతున్నాయి. విద్యుత్ శాఖ విద్యుత్ కోతల పై దృష్టి సారించాల్సిన అవసరం నెలకొంది.
నిర్లక్ష్యం వహిస్తే వేసవిలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
అడుగంటిన భూగర్భ జలాల చుట్టం ఈసారి వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసాయి. సాధారణ వర్షపాతం కంటే సుమారు 200 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం ఉమ్మడి జిల్లాలో అధికంగా నమోదయింది. కానీ జనవరి నెలలోనే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నాలుగు మండలాల్లో ప్రమాదకరస్థాయిని సూచిస్తున్నాయి. 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
15 మీటర్ల లోతులో దాదాపు 48 శాతం గ్రామాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ముందస్తుగానే నీటి వాడకంపై అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. నీటి వాడకం అధికం కావడం, చలికాలంలో కూడా ఎండల తీవ్రతతో భూగర్భ జలాల మట్టం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో సరాసరి నీటిమట్టం 10.9 మీటర్ల అడుగున చేరింది.
ఎండలు తీవ్రంగా మారితే రోజురోజుకు భూగర్భ జలాల మట్టం పడిపోతుంది. దీంతో సాగునీరు దేవుడెరుగు… తాగునీటికి కటకట వచ్చే ప్రమాదం నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు వ్యవసాయ బోర్లు 1లక్ష 80 వేల వరకు ఉంటాయి. ఇందులో అనేక వ్యవసాయ బోర్లు ఎత్తిపోయాయి. ఇళ్లల్లో వేసుకున్న తాగునీరు బోర్లలో కూడా నీరు తక్కువగా వస్తుంది. వీటికి తోడు తాగునీటి సరఫరా లో మిషన్ భగీరథ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
అనేక ప్రాంతాల్లో గ్రామాల్లో మిషన్ భగీరథ వాటర్ సరిగా రావడం లేదు. దీంతో తాగునీటి కటకటకు అప్పుడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలా వేసవికి ముందే నీటి ఇబ్బందులు ప్రజలను అందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రధానమైన శ్రీరాంసాగర్, ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. మంజీరా, గోదావరి నదులతో పాటు అనేక వాగులు ఉన్నాయి. వాగుల్లో నీటి నిల్వను ఉంచేందుకు చెక్ డ్యాములను భారీగా కట్టారు.
ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలోని పెద్దవాగు, కప్పల వాగులపై 25 పైగా చెక్ డ్యాములను నిర్మించారు. అయినప్పటికీ భీంగల్ ప్రాంతంలో భూగర్భ జలాలు 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇంత నీటి లభ్యత ఉన్నప్పటికీ, భారీ వర్షాలు కురిసినప్పటికీ భూగర్భ జలాలు అడుగంటడం అందోళనకరంగా మారింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అప్పుడే జిల్లా అధికార యంత్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వేసవి అబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పుడే మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
MOST READ :
-
CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!
-
Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
-
News : పార్టీ మారిన ఎమ్మెల్యేలు ట్విస్ట్.. ఒకే మాట.. ఒకే నిర్ణయం..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!










