District collector : జిల్లా కలెక్టర్ ని సందేహాలు అడిగిన గురుకుల విద్యార్థులు..!
District collector : జిల్లా కలెక్టర్ ని సందేహాలు అడిగిన గురుకుల విద్యార్థులు..!
సూర్యాపేట, మనసాక్షి :
విద్యార్థులు శ్రమని ఆయుధంగా భావిస్తే విజయం మీ బానిస అవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట పట్టణం లోని తాళ్ళగడ్డ లో గల యస్ సి సంక్షేమ గురుకుల స్కూల్, కాలెజి గృహాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని,ఆ లక్ష సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు.
పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులకి సూచించారు. అంతకు ముందు వసతి గృహం లో కిచెన్ ని, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో ఉన్న కూరగాయలు, పాలు, పప్పు, వంట సామాగ్రి ని పరిశీలించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ రోజు భోజనం ఇలాగే ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ ని పలు సందేహాలు అడగగా సమాధానం చెపుతూ విద్యార్థులని ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమం లో వసతి గృహ వార్డెన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Additional collector : రేపు నవోదయ ప్రవేశం పరీక్ష.. పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!
-
Penpahad : ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి.. రికార్డుల పరిశీలన..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!









