Miryalaguda : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు..!
Miryalaguda : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు..!
దామరచర్ల, మన సాక్షి:
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, రికార్డులన్నింటిని సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్ లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు. సోమవారం ఆస్పత్రికి హాజరైన సిబ్బంది, ఆప్సేంట్ అయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న సాధారణ ప్రసవాలు, ఓ పి,ఇన్ పేషెంట్లు తదితర వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి సకాలంలో వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చూడాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. మాత శిశు మరమణాలను తగ్గించాలని, ఆస్పత్రిలో అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఉన్నారు.
■ MOST READ :
-
Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!
-
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)









