Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : తీన్మార్ మల్లన్నకు షాక్..!

Hyderabad : తీన్మార్ మల్లన్నకు షాక్..!

హైదరాబాద్, మన సాక్షి :

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రెడ్డి జాగృతి సంస్థ షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా రెడ్డి సామాజిక వర్గం పై తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలకు గాంధీభవన్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని రోజులుగా పదేపదే రెడ్ల పై బహిరంగ వేదికలపై అణుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లయ్య తీన్మార్ మల్లయ్య పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లయ్య)చేత యావత్ రెడ్డి జాతికి బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేదా అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా,పట్టణ, మండల, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి జాతి నుండి వ్యతిరేకత చవి చూడక తప్పదని రెడ్డి జాగృతి నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల ఉప్పల్ రెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థపక సభ్యులు నీరుడు దయాకర్ రెడ్డి, రెడ్డి జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సురుకంటి నర్సిరెడ్డి, రెడ్డి జాగృతి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మేక సోమిరెడ్డి, రెడ్డి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు అలుగుబెల్లి రాంరెడ్డి, రెడ్డి జాగృతి నల్గొండ జిల్లా అధ్యక్షులు గాదె సైదిరెడ్డి, రెడ్డి జాగృతి నాయకులు కాందాడి రాజేందర్ రెడ్డి, మెండు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!

  2. Suryapet : చౌడమ్మ తల్లి కి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

  3. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!

  4. Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

మరిన్ని వార్తలు