Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల హల్చల్..!
Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల హల్చల్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం…20 తులాల బంగారం,25 వేలు నగదు అపహరణ సంఘటన బుధవారం వెలుగు చూసింది. దేవరకొండ అడిషనల్ ఎస్పి పి.మౌనిక, ఎస్ హెచ్ ఓ నర్సింహులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు తెలిపిన ప్రకారం పట్టణంలోని మీనాక్షి ప్లాజా లో షీలా వాసు అనే వ్యక్తి బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్ కు వెళ్ళాడు. ఇదే అదునుగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పలపడ్డారు.ఊరికి వెళ్ళిన షిలా వాసు సాయంత్రం ఇంటికి రావడంతో ఈ సంఘటన బయటపడింది.
ఈ దొంగతనంలో బంగారం ఆభరనాలతో పాటు నగదు రూ.25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్ హెచ్ ఓ నర్సింహులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంఘటన స్థలాన్ని చేరుకొని ఆధారాల సేకరిస్తున్న దేవరకొండ ఎస్సై అజ్మీరా రమేష్, ఎస్సై కోటయ్య, ఎస్సై నారాయణరెడ్డి, కానిస్టేబుల్ తిరుపతయ్య, హోంగార్డు సింహాద్రి, అంజయ్య ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!
-
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
-
Holidays : ఈ నెలలోనే మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!









