Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : జెవివి సైన్స్ ప్రదర్శన.. మూఢనమ్మకాలు, భయాలను తొలగించే కార్యక్రమం..!

Miryalaguda : జెవివి సైన్స్ ప్రదర్శన.. మూఢనమ్మకాలు, భయాలను తొలగించే కార్యక్రమం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని సైన్స్ వారోత్సవాలలో భాగంగా జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర పిలుపుమేరకు మిర్యాలగూడలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఆదివారం సమాజ అభివృద్ధిలో సైన్స్ యొక్క పాత్ర గురించి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు.

వారు విద్యార్థులలో ఉన్న భయాలు, మూఢనమ్మకాలను తొలగించుటకు సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేసి, మాట్లాడుతూ మానవాళి జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో గొప్పదని ఎన్నో యుగాల నుంచి వస్తున్న మార్పులు అన్నిటికీ కూడా సైన్సే కారణమని విద్యార్థులకు తెలియజేశారు.

డార్విన్ జీవపరిణామ సిద్ధాంత ఆవశ్యకతను తెలుపుతూ – జీవం ఎన్నో ఏళ్ల కిందట ఏర్పడిందని అది తదనంతరం పరిణామం చెందుతూ ఈ విధంగా మానవుని రూపంలో మరియు మిగతా జీవులలో కూడా క్రమేపి పరిణామం చెందుతూ ఉన్నత క్రమానికి చేరుకున్నదని తెలియజేశారు. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం సైన్స్ ఇచ్చిన ఒక విప్లవం అని తెలిపారు.

ప్రతి రంగంలో సైన్స్ యొక్క పాత్ర ఎంతో గొప్పదని దానిని వినియోగించుకొని విద్యార్థులు సైన్స్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని నల్లగొండ జిల్లా జె వి వి అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి తెలిపారు.

భారత రాజ్యాంగ ప్రకారం మానవత విలువలు పెంపొందించడానికి మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేయడమే ఏకైక మార్గమని అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని జేవివి రాష్ట్ర కమిటీ సభ్యులు కోలా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జె వి వి జిల్లా కార్యదర్శి గంగాధరి భద్రయ్య , కళాశాల ఇంచార్జ్
నాగకళ్యాణి,కోటేశ్వరి విద్యార్థినిలు పాల్గొన్నారు.
మూఢ నమ్మకాలను తొలగించుటకు విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.

■ MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  3. Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!

  4. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు