తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
District collector : శివరాత్రి మరుసటి రోజు 27న విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు.. ఎందుకంటే..!
District collector : శివరాత్రి మరుసటి రోజు 27న విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు.. ఎందుకంటే..!
నల్లగొండ, మన సాక్షి.
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 27న ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
అందువల్ల ఆయా విద్యాసంస్థలు, కార్యాలయాల అధిపతులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు గాను పోలింగ్ రోజున (27.2.2025) స్థానిక సెలవు ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే ప్రభుత్వ పాఠశాలలు ,కార్యాలయాలకు 27 న స్థానిక సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు.
MOST READ :
-
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
-
TGSRTC : శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..!
-
Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!









