Miryalaguda : మెగా హెల్త్ శిబిరానికి భారీ స్పందన..!
Miryalaguda : మెగా హెల్త్ శిబిరానికి భారీ స్పందన..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం కు భారీ స్పందన లభించింది. మంగళవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మెగా హెల్త్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో పేద కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ , లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే మెరుగైన వైద్యులతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా పట్టణంలోని గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విధంగా రైస్ మిల్లర్స్ సహకరించాలని కోరారు. వెంటనే సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ వారు అతి త్వరలో కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కర్నాటి రమేష్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!
-
MLC : ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికలకు పటిష్ట బందోబస్తు.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..!
-
Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!










