Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లాసంక్షేమం

District collector : ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండింగ్ పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

District collector : ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండింగ్ పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు త్రాగునీరు ఎన్ఆర్ఈజీఎస్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న వారిని జాబితాలో చేర్చాలన్నారు. పరిశీలన పూర్తి అయ్యాక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారని తప్పులు లేకుండా జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ లెవెల్ మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు.

త్రాగునీరు గురించి మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు అందుబాటులో ఉంచుకోవాలని మరమ్మత్తులు ఉంటే చేయించాలన్నారు. వేసవిదృశ్య ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు.

అన్ని గ్రామ పంచాయతీలలో ట్యాంకర్లను మరమ్మత్తులు చేయించుకోవాలన్నారు. ప్రైవేట్ బోర్వెల్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొత్త మోటర్లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్రాగునీరు ఉదయం 6 గంటలకల్లా గ్రామాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్ఆర్ఈజీఎస్ గురించి మాట్లాడుతూ గ్రామాలలో కూలీలకు ఉపాధి కల్పించేలా అవగాహన కల్పించాలన్నారు. పనులు జరిగే చోట త్రాగునీటి వసతి కల్పించాలని, పంచాయితీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయమే ఉపాధి పనులు ప్రారంభించాలని తెలిపారు. సరైన యాక్షన్ ప్లాన్ తో ఉపాధి హామీ పనులు చేయాలన్నారు.

నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు ఇప్పటినుండి చర్యలు తీసుకోవాలన్నారు. రోల్డ్ వైపు చెట్లు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, జడ్పీ సీఈవో, డి. ఆర్. డి. ఓ. డి. పి. ఓ.ఎంపీడీవో ఎంపీవో లు తదితరు గాలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. SLBC : SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కిన చోటు.. లేటెస్ట్ విజువల్స్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  4. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!

  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  6. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

మరిన్ని వార్తలు