క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడి..! 

Narayanpet : జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడి..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( ఈనెల 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ. యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, వివిధ సంఘాలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్పీ తెలిపారు.

ఎలాంటి అనుమతి లేకుండా ధర్నాలు సభలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు.

MOST READ : 

  1. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  2. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  3. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

  5. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు