Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
స్మార్ట్ ఫోన్ వాడేవారికి ఇది ఒక బిగ్ అని చెప్పవచ్చు. మీకు ఇటీవల కాలంలో టెక్స్ట్ మెసేజ్లు చాలా వస్తున్నాయి. అలాంటి మెసేజ్ లలో సైబర్ నేరగాళ్లు పంపేవి కూడా ఉన్నాయి. ఆ వెంటనే మెసేజ్ డిలీట్ చేయాలి.. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం..
మీకు స్మార్ట్ ఫోన్ కు వచ్చే మెసేజ్ ని వెంటనే డిలీట్ చేయమని FBI అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. యూఎస్ లో ఉండే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇటీవల సర్కిలేట్ అవుతున్న ఆ మెసేజ్ ను వెంటనే డిలీట్ చేయకుంటే బుక్ అయిపోతారు అంటూ హెచ్చరించారు.
అయితే యూఎస్ కు ఇండియాకు సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. కానీ సైబర్ నేరానికి దేశాలకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడి నుంచి అయినా సైబర్ నేరగాళ్లు మన డాటాను చోరీ చేయడంతో పాటు ఖాతాను ఖాళీ చేస్తుంటారు.
యుఎస్ లో మిస్సింగ్ వేవ్స్ ఎక్కువ అయ్యాయని వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. SMS, Shiping అనే పదాల నుంచి స్మిషింగ్ Smishing అనే పదం వచ్చింది. ఇక్కడ స్మిషన్ అంటే అత్యంత వేగంగా మెసేజ్లు స్ప్రైడ్ కావడం.
వివిధ ఆఫర్ల పేరుతో వెబ్సైట్లను సైతం హాక్ చేసి టెక్స్ట్ మెసేజ్లు సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. అలాంటివి మనం క్లిక్ చేస్తే సైబర్ వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాటిని ఓపెన్ చేయడంతో పాటు వాటికి డబ్బులు పంపి కొనుగోలు చేస్తే ఇంకా ఖాతా ఖాళీ అవుతుంది.
ఉదాహరణకు అమెజాన్ లో ఒక టీవీ 25000 రూపాయలు ఉంటే అదే అమెజాన్ సైట్ నుంచి మెసేజ్ పంపినట్లుగా సైబర్ నేరగాళ్లు కేవలం 10000 రూపాయలకే టీవీ ఉందని మెసేజ్ లు పంపుతుంటారు. అది తెలియక దానిని ఓపెన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వెంటనే మన డీటెయిల్స్, బ్యాంకు ఖాతా హ్యాక్ అవుతుంది. మన ఖాతా ఖాళీ చేస్తుంటారు.
అందుకని మనకు తెలియని టెక్స్ట్ మెసేజ్ లు వివిధ కంపెనీల నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజ్ లు సైతం ఓపెన్ చేయకుండా వాటిని వెంటనే డిలీట్ చేస్తే మంచిదన, సైబర్ వలలో చిక్కుకోకుండా ఉండవచ్చునని FBI అధికారులు పేర్కొంటున్నారు.
Similar News :
-
Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
- Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!
- UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
- Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!









