Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsసూర్యాపేట జిల్లా

Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!

Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ ను హత్య కేసును త్వరలో చేదిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మల్టీజోన్ 2 ఐజిపి సత్యనారాయణ చెప్పారు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య కుటుంబంతో ఐజి సత్యనారాయణ, ఎస్పీ నరసింహ లు బుధవారం మాట్లాడారు.

గ్రామంలో పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఐజి సత్యనారాయణ మాట్లాడుతూ మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించాం అని అన్నారు. హత్యలో సొంత అల్లుళ్ళే ప్రాధాన పాత్ర పోషించారునీ, ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాం అని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందనీ వివరించారు.

హత్యలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం అని వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో 5 ప్రత్యేక టీములను ఏర్పాటు చేసాం అని తెలిపారు.
కేసుని త్వరలోనే చేదిస్తామని స్పష్టం చేశారు.

అనుమానితులు అక్రమ భూ సెటిల్మెంట్లు చేస్తునట్లు గుర్తించాం అని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.
హత్య విషయంలో అజాగ్రత్తగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేస్తాం అని, రానున్న స్థానిక ఏన్నికల నేపథ్యంలో సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చూస్తున్నట్లు ఐ జి సత్యనారాయణ వివరించారు. ఇంకా ఐజి తో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, డిఎస్పి జి. రవి, సిఐలు,ఎస్సైలు ఉన్నారు.

MOST READ : 

  1. BIG BREAKING: రేవంత్ రెడ్డి పై హైకోర్టులో కేసు కొట్టివేత..!

  2. Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

  4. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  5. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

మరిన్ని వార్తలు