క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : NH65 పై బ్లాక్ స్పాట్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..!

Nalgonda : NH65 పై బ్లాక్ స్పాట్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ..!

నల్లగొండ, మన సాక్షి :

ఎన్ హెచ్ 65 నేషనల్ హైవే పైన గల కట్టంగూర్ నల్గొండ ఎక్స్ రోడ్ కురుమర్తి ఎక్స్ రోడ్ నకిరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్ వద్ద అక్కడి చుట్టూ పక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురి అవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ ఎన్ హెచ్ ఎ ఐ చౌదరి కంపెనీ, రాం కుమార్ కన్స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా సర్వీస్ రొడ్డులు, కురుమర్తి క్రాస్ రోడ్డు నుంచి కట్టంగూర్ అండర్ పాస్ వరకు సర్వీస్ రోడ్డు వేయాలని అలాగే అన్ని జంక్షన్ ల వద్ద హై మాక్స్ లైట్స్,సెంట్రల్ లైటింగ్, బ్లింకర్స్,జీబ్రా క్రాసింగ్ లైన్స్ , రంబుల్ స్టిక్స్,మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులకు ఆదేశించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే,స్టేట్ హైవేల పైన యాక్సిడెంట్‌ ఫ్రోన్‌,బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నమని అన్నారు.

(మిషన్ త్రిబుల్ ఆర్) రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరచాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, NHAI రెసిడెంట్ ఇంజనీర్ కిషన్ రావు, జోగేంద్ర చౌదరి కంపని ప్రాజక్ట్ మేనేజర్ నాగ కృష్ణ , రాం కుమార్ కన్స్ట్రక్ట్షన్ సంజీవ చౌదరి, డి.టి.ఆర్బి రిటైర్ సీఐ అంజయ్య తదితరులు పాల్గోన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

  2. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  3. Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

  4. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  5. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు